వికారాబాద్ జిల్లా కడ్తాల్‌లో ఉన్న మహేశ్వర మహాపిరమిడ్‌లో మంగళవారం రాత్రి మహిళా ధ్యాన మహాచక్రాల సభలు-3ను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రీజీ మాట్లాడుతూ.. మహేశ్వర మహాపిరమిడ్‌తో కడ్తాల్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.
ఈ సభలను 11 రోజుల పాటు నిర్వహిస్తామని, ధ్యాన సభలకు వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు పత్రీజీ తెలిపారు. ధ్యానం సర్వరోగ నివారిణి అని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలని ఆయన సూచించారు.