ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుభాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. డీఫార్మసీ , బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, ఇంటర్, ఎస్సెస్సీ చదివిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు.
జాబ్ మేళాలో మొత్తం 250 మందిని ఎంపిక చేసుకుంటారని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు సెల్: 8374366444, 9177607016 నంబర్లలో సంప్రదించాలని కోరారు.