పెద్దేముల్: వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలో ఉన్న డ్వాక్రా సంఘాలకు రూ.365 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ వీరయ్య వెల్లడించారు. పెద్దేముల్ మండల మహిళా సమాఖ్య భవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొండి బకాయిలు ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేది లేదని, రుణాలను సకాలంలో చెల్లిస్తున్న వారికి మాత్రం అధిక మొత్తంలో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ చివరి నాటికి రూ.240 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని నిర్దేశించుకోగా ఇప్పటికే లక్ష్యానికి మించి రూ .267 కోట్లు మంజూరు చేశామన్నారు. రుణాల పంపిణీలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందన్నారు. మొత్తం రూ.27 కోట్ల మొండి బకాయిలు ఉండగా రూ.7.75 కోట్లను రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.