త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం బిపిన్ రావత్ చేసిన సేవలు చిరస్మరణీయం అని, భారత ప్రజలు ఆయనను ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు.
ఫాగ్గింగ్ మిషన్ల పంపిణీ..
తాండూరు పట్టణం తులసి గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 123 గ్రామ పంచాయతీలకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాగ్గింగ్ మిషన్లను పంపిణీ చేశారు.