తాండూరు: మార్వాడీ యువమంచ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. మార్వాడీ యువమంచ్ అధ్వర్యంలో తాండూరు పట్టణం బాలాజీ మందిర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వాసులతో పాటు కర్ణాటక నుంచి సైతం కృత్రిమ అవయవాల కోసం ఈ శిబిరానికి బాధితులు వచ్చారన్నారు.
గత రెండు రోజులుగా సుమారు 250 మంది కృత్రిమ అవయవాల కోసం వచ్చారని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మార్వాడీ యువమంచ్ అందిస్తున్న సేవలను విస్తరించేందుకు మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.