తాండూరు: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నియోజకవర్గానికి చెందిన చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.4.35 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన స్వాతి రూ.2లక్షలు, చెన్గేష్ పూర్ గ్రామానికి చెందిన గుండప్ప రూ.40వేలు, తాండూరు పట్టణానికి చెందిన విజయకుమార్ రూ.60 వేలు, పాషామియాకు 1.25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. సిఎంఆర్ఎఫ్ సహాయం కావాల్సిన వారు తన క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.