తాండూరు పట్టణంలోని ఖంజాపూర్ గేట్ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను, విద్యార్థులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహకారంతో విద్యార్థులకు కావాల్సిన మౌలికవసతులను కల్పిస్తామన్నారు.
పాఠశాల బయట విద్యుత్ దీపాలు లేవని విద్యార్థులు ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయిలో రాణించిన ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు.