ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన బషీరాబాద్ మండలం మర్పల్లికి చెందిన కావలి మేఘన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కేటీర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను సన్మానించి అభినందనలు తెలిపారు.