రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, శాంభీపూర్ రాజు టీఆర్ఎస్ అభ్యర్థులుగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం హాజరయ్యారు. మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి అభ్యర్థులకు పార్టీ బీ ఫార్మ్‌లు అందజేశారు.