రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తండూరు నుంచి తరలి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు.