దీపావళి పర్వదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. చిన్న పిల్లలు టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.