తాండూరు: జిల్లాకు చెందిన బీసీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పుష్పలత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని, అర్హత ఉన్న విద్యార్థులు ఈ-పాస్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.