తాండూరు: తాండూరు విద్యార్థులు కరాటే పోటీల్లో సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో సోమవారం నిర్వహించిన 7వ నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. ఐదు గోల్డ్ మెడల్స్, పది సిల్వర్ మెడల్స్ సాధించి ప్రశంసలు అందుకున్నారు.
కరాటే కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదని, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని కరాటే మాస్టర్ బీవీ సాయి పేర్కొన్నారు. హర్షిత, సుధీర్, కార్తీక్, అనన్య, సాయి గోల్డ్ మెడల్స్ సాధించగా మరో పది మంది సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ఆయన వెల్లడించాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతానన్నారు.