తాండూరు: పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మరి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.