తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గం కంది పంటకు ప్రసిద్ధి అని, తాండూరు కంది పప్పుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉందని రోహిత్ రెడ్డి సభలో తెలిపారు. కంది రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. రైతుల శ్రేయస్సు కోసం తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన విజ్ఙప్తి చేశారు. బోర్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.