తాండూరు: తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయ్యుం అఫ్ఫు, తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండలానికి మల్లారెడ్డి, పెద్దేముల్ మండలానికి కొహిర్ శ్రీనివాస్, బాషీరాబాద్ మండలానికి రామునాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి జహంగీర్ పాషా సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుల పేర్లు వెల్లడించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో దేశంలోనే అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.