తాండూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోటిపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో నీలి విప్లవం మొదలైనట్లు వెల్లడించారు.
గత ఏడేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మత్స రంగంలో స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ ద్వారా చేపల ఉత్పత్తి పెరగడంతో పాటు లక్షలాది మంది మత్స్యకారులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.