తాండూరు: బుధవారం నుంచి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేయనున్నట్లు తాండూరు బస్ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల పాసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు ప్రారంభిస్తుండటంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.