రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని లేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసినట్లు తెలుస్తోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేసేందుకు చివరి క్షణం వరకూ పోరాడారు కోమటిరెడ్డి. అయితే రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట.