ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 535 ఖాళీలతో గ్రేడ్ 3 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేనెల 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 535
ఎలక్ట్రీషియన్ 38, ఫిట్టర్ 144, మెకానిక్ మోటార్ వెహికల్ 42, మెషినిస్ట్ 13, డీజిల్ మెకానిక్ 97, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 40, బాయిలర్ అటెండెంట్ 8, టర్నర్ 4, డ్రాట్స్‌మెన్ సివిల్ 8, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 81, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 44, సర్వేయర్ 5, వెల్డర్ 6, ఐటీ అండ్ ఈఎస్‌ఎం 5 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్ చదివి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23
వెబ్‌సైట్: https://www.oil-india.com