తాండూరు: తాండూరు మండల పరిధిలోని అంతారం గుట్ట వద్ద జరుగుతున్న ఆడిటోరియం నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ వెంకట్రావు పరిశీలించారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.