తాండూరు: ఆగస్టు 3వరకు భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ప్రస్తుత ఏడాదికి సంబంధించి రైతు బీమా కోసం ధరఖాస్తు చేసుకోవాలని పూడూరు మండల వ్యవసాయ అధికారి సామ్రాట్‌రెడ్డి, తాండూరు మండల ఏడీఏ శంకర్‌రాథోడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పొలం పట్టా పాస్‌బుక్, పట్టాదారు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌లను ధరఖాస్తు ఫామ్‌కు జతచేసి వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.