తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా బషీరాబాద్‌లో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గతంలో పనులు ప్రారంభించి పూర్తి చేసుకున్న వాటిని ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
నియోజకవర్గ పర్యటన అనంతరం ఆదివారం ఉదయం 11గంటలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తాండూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రజలు వారి సమస్యలు వివరించవచ్చని తెలిపారు.