తాండూరు: మిషన్ భగీరథ పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నపరిమళ్ అధికారులను హెచ్చరించారు. పట్టణంలో జరుగుతున్న భగీరథ పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వ్యాపారులు, ప్రజలు చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భద్రేశ్వర్ చౌక్ నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు వరకు గుంతలు తవ్వి వదిలేసిన పనులను ఆమె బుధవారం పరిశీలించారు.
కాలినడకన వెళ్లేవారికి సైతం ఇబ్బందిగా మారడంతో చైర్ పర్సన్ స్వప్న భగీరథ అధికారుతో మాట్లాడారు. పనుల్లో నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆగిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.