తాండూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రజలు, పలు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన వద్దకు వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అండతో నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆదివారం రాఖీ పౌర్ణమి కావడంతో జిల్లా మహిళా సమైక్య మాజీ అధ్యక్షురాలు శకుంతలతో పాటు పలువురు మహిళలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.