తాండూరు:ప్రజా సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ పౌసమి బసు తెలిపారు. అధికారులతో తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజావాణికి బదులుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు వివరించేందుకు 08416-256989 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
ప్రతీ సోమవారం ఉదయం 9గంటల నుంచి 10:30 నిముషాల వరకు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలు వివరించవచ్చన్నారు. కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజు 13 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలుపగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.