తాండూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే ప్రస్తుతం మనం స్వేచ్చగా బతకడానికి కారణమన్నారు.
మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, నేతాజీ, శివాజీ లాంటి మహనీయులను మనం ఎప్పటికీ మరచిపోలేమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని పాఠశాలలతో పాటు పలు కూడళ్లలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.