తాండూరు: తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ బాట కార్యక్రమంలో భాగంగా ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డుల్లోని ప్రతీ గల్లీలో ఆయన పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రతీ రోజూ 6 వార్డుల చొప్పున ఆయన పర్యటన కొనసాగనుంది. మూడు రోజుల పర్యటన అనంతరం ఈ నెల 30, 31, అక్టోబర్ 1వ తేదీల్లో మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పట్టణంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. మెదటి రోజు సోమవారం 14,15,16,17,18 వార్డుల్లో పర్యటించనున్నారు.