తాండూరు: నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.