హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2022 షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హులు. సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించి ఓటరు లిస్టులో ఉన్న తప్పులను సరి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు కార్డులో మార్పుల కోసం నవంబర్ 1 నుంచి www .nvsp .in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.