తాండూరు: బషీరాబాద్ మండలం నిళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులదే అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం సైతం చాలా అవసరమని, అందుకోసం గ్రామస్తులు ప్రజాప్రతినిథులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కల నివారణ మందును ఎమ్మెల్యే పిచికారీ చేశారు.