పెద్దేముల్: రెవెన్యూ అధికారుల నుంచి కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి నజీరొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3వ తేదీ లోపు భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉండాలని.. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు రైతుబీమాకు అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.
బీమాకు దరఖాస్తు చేసుకునేవారు పొలం పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్సు కాపీలను దరఖాస్తు ఫారంకు జతచేసి సంబంధిత వ్యవసాయ అధికారులకు అందించాలని సూచించారు. మండల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం నుంచి పంటల వివరాలు సేకరిస్తామని నజీరొద్దీన్ తెలిపారు.