తాండూరు: మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలకు వరమని చెప్పారు. పేద ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.