తాండూరు: ఇకనుంచి ప్రతీ ఇంటికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కరోనా మొదటి, రెండవ దశల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, థర్డ్ వేవ్ ముప్పు సైతం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే టీకా తీసుకునేందుకు మాత్రం ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లడం లేదు. దీంతో వైద్య సిబ్బందే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖను ప్రభుత్వం ఆదేశించింది.