తాండూరు: అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తాండూరు పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న ఎండి గౌస్ ఇళ్లు షాక్ సర్క్యూట్‌తో దగ్ధమై ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి సహాయం అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబానికి బరోసానిచ్చారు.
ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా వేసి పైఅధికారులకు నివేదిక అందించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.