తాండూరు: తాండూరు నియోజకవర్గానికి అంబేడ్కర్ భవనాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో రెండు భవనాలు మంజూరు కాగా.. రూ.1 కోటి వ్యయంతో తాండూరు పట్టణంలో ఒకటి, రూ.50 లక్షలతో యలాల మండల కేంద్రంలో మరో భవనాన్ని నిర్మించనున్నారు.
తమ ప్రాంతాలకు అంబేడ్కర్ భవనాలు మంజూరు చేయండంపై తాండూరు, యలాల మండలాలకు చెందిన దళత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించారు. భవనాల నిర్మాణానికి స్థలాలు గుర్తించి వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.