హైదరాబాద్: ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న విశ్వనగరం హైదరాబాద్ మరో విషయంలోనూ దక్షిణ భారతదేశం లోనే ప్రత్యేకంగా నిలవబోతోంది. దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం నగరంలో నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా సంస‍్థ జీ+57 అంతస్తులతో క్రౌన్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 228 మీటర్లు. ప్రస్తుతం దక్షిణాదిలో 50 అంతస్తుల భవనంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఇక మీదట ఈ ప్రత్యేకతను హైదరాబాద్ సొంతం చేసుకోనుంది.
హైదరాబాద్ కోకాపేటలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌ఏఎస్ సంస్థ క్రౌన్ ప్రాజెక్టు చేపట్టింది. 6,565 చదరపు అడుగులు, 6,999 చదరపు అడుగులు, 8,811 చదరపు అడుగుల్లో నిర్మాణాలుంటాయి. చదరపు అడుగు ధర రూ.8,950గా నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. 2025 తొలి త్రైమాసికం నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందని వారు తెలిపారు.