తాండూరు: పెద్దేముల్ మండలంలోని రైతులు తమ పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నజీరుద్దిన్ సూచించారు. మండల పరిధిలోని గిర్మాపూర్, గోట్లపల్లి, ఇందూరు గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించి పలు రకాల పంటలను పరిశీలించారు. రైతులు సాగు చేస్తున్న అన్ని పంటల వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని నజీరుద్దిన్ కోరారు.
సాగు వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పంట అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన చెప్పారు. సాగు విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని సూచించారు.