తాండూరు: ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బెంజిమెన్కు రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చుల భారం మోయలేని పేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ సీఎం సహాయనిధి నుంచి సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.