తాండూరు: పట్టణంలో సమస్యల పరిష్కారమే థ్యేయంగా చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. పాత తాండూరులోని కోటేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పట్టణంలో వార్డుల పర్యటనకు బయలుదేరారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టణ సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.