ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) సంస్థలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులున్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 22
హైదరాబాద్‌లో ఖాళీలు: 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 8 (హైదరాబాద్‌లో 1 పోస్టు)
అసిస్టెంట్ సూపర్వైజర్ అకౌంట్స్: 14 (హైదరాబాద్‌లో 2 పోస్టులు)
అర్హతలు: ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏలలో ఏదో ఒకటి చదివి ఉండాలి. అకౌంట్స్ పోస్టులకు కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: http://aiesl.airindia.in/
వయస్సు: ఫైనాన్స్ పోస్టులకు 30 ఏళ్లు, అకౌంట్స్ పోస్టులకు 28 ఏళ్ల లోపు వారై ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి.. అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: AIESL
Personnel Department,
2nd Floor, CRA Building, Safdarjung Airport Complex,
Aurbindo Marg, New Delhi – 110 003