తాండూరు: తాండూరు పట్టణం సాయిపూర్లోని ఉర్దూఘర్ చైర్మన్‌గా అబ్దుల్ రజాక్ నియమితులయ్యారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచన మేరకు ఉర్దూఘర్ కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ పౌసమి బసు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా మహమ్మద్ అన్వర్ ఖాన్, అస్లాం బిన్ అసద్, ఎండీ ఇబ్రహీం ఖాన్, రజియా బేగం, అబ్దుల్ రెహమాన్, ఉర్దూ అకాడమీ సభ్యుడిగా వి. కృష్ణ ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్ కు నియామకపత్రం అందించారు. రెండేళ్ల పాటు కొనసాగనున్న ఈ కమిటీకి తాండూరు తహసీల్దార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.