తాండూరు: తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జరుగుతుందని సమితి అధ్యక్షురాలు, తాండూరు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. పట్టణంలోని తులసీ గార్డెన్లో ఎన్నిక కార్యక్రమం నిర్యహించనున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలోని హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆమె కోరారు.